KRNL: ఆదోనిలోని అన్నా క్యాంటీన్‌ను ఇవాళ మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌ను చేరుకున్న ఆయన, అక్కడ అందుతున్నసేవలపై ఆరా తీశారు. అక్కడ పాటిస్తున్న పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం అల్పాహారం చేస్తున్న సామాన్య ప్రజల వద్దకు వెళ్లి, ఆహారం రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు.