KRNL: పెద్దకడబూరులోని బీసీ, ఎస్సీ కాలనీల్లో MPP నిధులు రూ.15 లక్షలతో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. MPP శ్రీవిద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ సుజాత కలిసి భూమి పూజ నిర్వహించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.