• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వసతి గృహాలు తనిఖీ చేసిన ఫుడ్ కమిటీ ఛైర్మన్

అన్నమయ్య: మదనపల్లెలో ఫుడ్ కమిటీ ఛైర్మెన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్థానిక పుంగనూరు రోడ్డులోని సోషల్ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. శనివారం ఐసీడీఎస్ సీడీపీవో నాగవేణి, రెవెన్యూ అధికారులు, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి హాజరై ఫుడ్ కమిటీ ఛైర్మెన్తో కలసి వసతి గృహాల్లో చుదువుతున్న బాలికలను పలకరించారు.

March 8, 2026 / 10:24 AM IST

సౌకర్యాలు లేక… సేవలకు అంతరాయం

NLR: గత ప్రభుత్వంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల పేర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలుగా మార్పులు చేశారు. మార్పులు అయితే చేశారు కానీ అక్కడ ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం జరుగుతున్న పరిస్థితి బుచ్చి మండలంలో చోటు చేసుకుంది. పట్టణంలోని 5 సచివాలయాలలో సౌకర్యాలు లేకనే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి.

March 8, 2026 / 10:24 AM IST

మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మిగనూరు రోడ్డు కంట్రోల్ రూమ్ వద్ద మహిళా పారిశుద్ధ్య కార్మికులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా కార్మికుల చేత కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

March 8, 2026 / 10:22 AM IST

గర్భిణీకి అండగా ఆశ్రయ అనాథాశ్రమం

ATP: కళ్యాణదుర్గం వీధుల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేని మహిళకు ఆశ్రయ అనాథాశ్రమం అండగా నిలిచింది. ఏడు నెలల క్రితం సామాజిక కార్యకర్త శశికళ చొరవతో ఆమెను ఆశ్రమానికి చేర్చారు. పరీక్షల అనంతరం ఆమె గర్భవతి అని తేలడంతో నిర్వాహకులు దేవి కృష్ణారెడ్డి కుటుంబం సంరక్షణ బాధ్యతలు చేపట్టింది. ఈ నెల 19న ప్రసవం జరిగే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

March 8, 2026 / 10:20 AM IST

విజయనగరం జిల్లాలో నేడు చికెన్ ధరలు

విజయనగరం జిల్లాలో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ కిలో రూ.200 నుంచి రూ.280 వరకు ఉంది. స్కిన్‌లెస్ చికెన్ రూ.220 నుంచి రూ.300 వరకు, నాటు కోడి రూ.250 నుంచి రూ.350 పైగా విక్రయిస్తున్నారు. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

March 8, 2026 / 10:17 AM IST

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

 KDP: ఎర్రగుంట్ల మండలంలో RTPP ఉద్యోగి రామయ్య (36) మృతి చెందాడు. సోదరుడి రాళ్ల పరిశ్రమ నుంచి కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకొని వస్తూ ఉండగా టైరు పేలి స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు ట్రాక్టర్ మీద పడ్డాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కూలీలకు ప్రాణాపాయం తప్పింది. కొద్దిసేపటికి రామయ్య ట్రాక్టర్‌ను తాకగానే విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.

March 8, 2026 / 10:17 AM IST

చికిత్స పొందుతూ బాలుడు మృతి

VSP: ద్వారక నగర్‌కు చెందిన బాలుడు అక్షయ్ అపార్ట్‌మెంట్ వద్ద ఆడుకుంటుడగా గోతిలో పడి గాయపడ్డాడు. దీంతో ఈ నెల 3న కేజీహెచ్‌లో చేర్పించారు. కాలికి ఆపరేషన్ చేసిన అనంతరం బాలుడు కోమలోకి వెళ్లగా రెండు రోజులుగా వెంటిలేటర్ పైన ఉంచారు. ఇవాళ ఉదయం మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

March 8, 2026 / 10:15 AM IST

సత్య కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

VZM: సత్య కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయదుర్గ యువసంఘం ఛైర్‌పర్సన్ కె.జయలక్ష్మి, వేణుగోపాలపురం గిరిజన సంక్షేమ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ టి.వీరమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేటి సమాజంలో మహిళలకు లభిస్తున్న అవకాశాలపై వారు ప్రసంగించారు. కళాశాల డైరెక్టర్ శశి భూషణరావు పాల్గొన్నారు.

March 8, 2026 / 10:15 AM IST

టీడీపీ నేత ఇంటికి అగ్ని ప్రమాదం

KRNL: ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని టీడీపీ నేత ఉమాపతి నాయుడు ఇంటి పక్కన శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆకతాయిలు నిప్పంటించారు. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరి మంటలను ఆర్పారు. కాలనీవాసులు అధికారులు రక్షణకు కృతజ్ఞతలు తెలిపారు.

March 8, 2026 / 10:12 AM IST

రేపు సీఎం చంద్రబాబు పర్యటన

NDL: డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ‘మాభూమి–మాహక్కు’ గ్రామ సభలో పాల్గొని రైతులకు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి, టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు.

March 8, 2026 / 10:11 AM IST

ప్రత్యేక అలంకరణలో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు

SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని ఇవాళ ప్రత్యేకంగా అలంకరించి, పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, గోత్రనామాలతో పూజలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని కమిటీ సభ్యులు తెలిపారు.

March 8, 2026 / 10:11 AM IST

పూర్తి సీసీ రోడ్డు నిర్మాణానికి డిమాండ్

ASR: డుంబ్రిగూడ మండలం కోసంగి గ్రామంలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండల వైసీపీ కార్యదర్శి శంకర్ ఇవాళ డిమాండ్ చేశారు. ప్రస్తుతం గ్రామంలో సీసీ రోడ్డు కొంతమేర మాత్రమే నిర్మిస్తున్నారని తెలిపారు. దీంతో వర్షాకాలంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని కోరారు.

March 8, 2026 / 10:09 AM IST

మాజీ సర్పంచ్ చిత్రపటానికి నివాళులర్పించిన వైసీపీ సమన్వయకర్త

CTR: వెంకటగిరి రూరల్ మండలం చిన్నన్నపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ దవల రామయ్య ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

March 8, 2026 / 10:07 AM IST

పార్టీ బలోపేతమే లక్ష్యం: కేతిరెడ్డి

సత్యసాయి: కార్యకర్తలకు అన్యాయం జరిగిందని పార్టీ అధినాయకుడు జగన్‌ గ్రహించారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 9 వేల మందితో కమిటీలు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

March 8, 2026 / 10:06 AM IST

జిల్లా స్పెషల్ వంటకం ‘ఉగ్గాని’

ATP: సాధారణంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం ఫేమస్. జిల్లాలో చేసే ప్రత్యేకమైన వంటకాల్లో ఉగ్గాని ఒకటి. చాలా మంది బ్రేక్​ఫాస్ట్‌లో ఉగ్గాని, బజ్జీలతో కలిపి తినడానికి ఇష్టపడుతుంటారు. జిల్లాలో ఏ టిఫిన్ సెంటర్‌కి వెళ్లిన ఉగ్గాని బజ్జీ కచ్చితంగా లభిస్తుంది. ఈ ఉగ్గాని రెసిపీ వేడివేడి మిర్చీ బజ్జీలతో ఎంతో రుచిగా ఉంటుంది. చిన్న పిల్లలు సైతం ఇష్టంగా తింటారు.

March 8, 2026 / 10:00 AM IST