KDP: ఎర్రగుంట్ల మండలంలో RTPP ఉద్యోగి రామయ్య (36) మృతి చెందాడు. సోదరుడి రాళ్ల పరిశ్రమ నుంచి కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకొని వస్తూ ఉండగా టైరు పేలి స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు ట్రాక్టర్ మీద పడ్డాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కూలీలకు ప్రాణాపాయం తప్పింది. కొద్దిసేపటికి రామయ్య ట్రాక్టర్ను తాకగానే విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.