BDK: మణుగూరు మండలం సుందరయ్య నగర్లో నిర్వహించిన దశావతార శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు తీసుకున్నారు. గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన MLA భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.