ELR: నిడమర్రు మండలం బావయిపాలెం గ్రామంలో వెలసియున్న శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి వారి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన నవగ్రహ మండపం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.