KMM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ నాయకన్ గూడెం సర్పంచ్ కంచరి సైదమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త ఆటో నడుపుతూ టైర్ల షాపు నిర్వహిస్తుండగా ఆమె ఖాళీ సమయాల్లో ఆయనకు చేదోడుగా ఉంటూ పంచర్లు వేసేవారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా ఆమె తన పనిని వదలకుండా ఒకపక్క గ్రామ అభివృద్ధి పనులు చూస్తూనే మరోపక్క కష్టాన్ని నమ్ముకుని శ్రమిస్తున్నారు.