విక్టరీ వెంకటేష్‌తో దర్శకుడు త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను 2026 అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వేసవి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.