BHPL: చిట్యాల మండలం తిరుమలపూర్ గ్రామ శివారులో రహదారి పక్కన ఉన్న చేతిపంపు పాడైపోయి పిచ్చి మొక్కల మధ్య దర్శనమిస్తుంది. వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి ఈ పంపు ఉపయోగపడుతుందని గ్రామస్థులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చేతిపంపు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి.. చేతి పంపును మరమ్మత్తులు చేయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.