SDPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు తన ప్రతిభను చాటారు. పసుపు బియ్యంతో ఒక మహిళా చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “స్త్రీ లేనిదే ప్రపంచమే శూన్యం” అని,మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. తన కళాఖండాన్ని మహిళా లోకానికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.