HYD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూకట్పల్లిలోని MLA క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. MLA మాధవరం కృష్ణ రావు వారితో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తూ ముందుకు వెళుతున్నారని స్త్రీ లేనిదే జననమే లేదని, భూదేవి అంత ఓర్పు ఉన్న ఆ స్త్రీ మూర్తికి మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేమని పేర్కొన్నారు.