TG: మహిళలను బంధాలతో కాకుండా మనుషులుగా గౌరవిద్దామని BRS నేత KTR అన్నారు. మహిళా దినోత్సవం వేళ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. మహిళలూ పురుషులతో సమానమేనని, వారికి సమాన గౌరవం, హోదా లభించాలని మనం మనస్ఫూర్తిగా అంగీకరించినరోజే ఈ ప్రపంచం మెరుగైన ప్రదేవం అవుతుందన్నారు. మహిళలు తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడే పరిస్థితి రాకుండా నడుచుకుంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.