ATP: ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన హలీం రుచులు ఇప్పుడు అనంతపురం జిల్లాలోని ప్రధాన పట్టణాలకు చేరువయ్యాయి. రంజాన్ మాసం కావడంతో అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం వంటి ప్రాంతాల్లో హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్థానిక హోటళ్లతో పాటు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థలు సైతం ఇక్కడ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాయి.