KNR: కార్మిక శాఖ హుజురాబాద్ సహాయ కార్మిక అధికారిణి (ఏఎల్ ఓ) డి.చందనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆ శాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ వినీత ఒక ప్రకటన విడుదల చేశారు. చందన భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచడం, విధులకు గైర్హాజరు కావడంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.