SDPT: బెజ్జంకి మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ‘ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న విష వాయువుల వల్ల పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇథనాల కంపెనీ వదిలే రసాయనాల వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయి’. వెంటనే ఈ ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.