KMM: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శనివారం ఇఫ్కో కంపెనీకి చెందిన 2,670.84 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఈ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,070.84 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 900 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు టెక్నికల్ ఏఓ పవన్ కుమార్ తెలిపారు.