MHBD: కోర్టు ఉత్తర్వుల మేరకు గతంలో స్వాధీనం చేసుకున్న పచ్చిరొట్ట విత్తనాలను ఈనెల 10 (మంగళవారం) ఉదయం10:00 గంటలకు వేలం వేయనున్నట్లు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు. మండల వ్యవసాయ అధికారి రాంనర్సయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు. ఈ వేలం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించనున్నామని, ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనాలని కోరారు.