ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో గాయపడి నరసరావుపేటలో చికిత్స పొందుతున్న పెద్దారవీడు మండల వైస్ ఎంపీపీ గుండారెడ్డి వెంకటేశ్వర రెడ్డిని ఆదివారం యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.