ATP: గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి దేవస్థానంలో ఆదివారం పైల నరసింహయ్య ఆధ్వర్యంలో జరిగిన ఉచిత సామూహిక వివాహాలకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.