VZM: మహిళలు అన్ని రంగాల్లో జిల్లాను నెంబర్ వన్ స్థాయిలో నిలపాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇవాళ గజపతినగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సత్కరించి, మహిళలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా నిలవాలని అన్నారు.