కడప: జిల్లా పెండ్లిమర్రి మండలంలోని వెయ్యినూతుల కోన శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అహోబిలం నుంచి స్వామివారు ఉగ్రరూపంతో వచ్చి ఇక్కడ స్వయంభువుగా వెలిశారని చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సాలువ మంగరాజు ఈ గుడిని నిర్మించగా, అచ్యుత రాయల కాలంలో ఆలయం మరింత అభివృద్ధి చెందింది. దేవతలే రోజూ స్వామివారిని పూజిస్తారని నమ్మకం.