AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ కల్పించకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది అత్యంత విచారకరమైన ఘటనని పేర్కొన్నారు. మన దేశంలో రాష్ట్రపతి పదవి అత్యున్నత రాజ్యంగ హోదా కలిగి ఉందన్నారు. ఆ పదవికి ఎప్పుడూ అత్యున్నత గౌరవాన్ని ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేలా చూడటం సంబంధిత యంత్రాంగం బాధ్యత అని వెల్లడించారు.