NLR: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గుడ్లూరు మండలం వెంకంపేటకు చెందిన తుపాకుల రత్తమ్మ గాయపడ్డారు. ఐదేళ్లుగా హైదరాబాద్లో నివసిస్తున్నారు. మరో ఇద్దరితో కలిసి బస్సులో దుత్తలూరుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆమెతో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. రత్తమ్మతో పాటు మరొకరు మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.