NDL: బేతంచెర్ల సమీపంలోని జిల్లా రహదారిపై ఇవాళ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గోరుమాను కొండ వైపు వెళ్తున్న బైకును వెనుక నుంచి వస్తున్న మరో వాహనం అధిగమించే క్రమంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోజ్‌తో పాటు మరో యువకుడు గాయపడ్డినట్లు స్థానికులు తెలిపారు. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు పంపించారు.