రణ్వీర్ సింగ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ధురందర్’ షూటింగ్ పూర్తయిన సందర్భంగా తన హెయిర్ స్టైలిస్ట్ ముస్కాన్‌కు రణ్వీర్ స్వయంగా చేతితో రాసిన కృతజ్ఞతా లేఖను అందించాడు. ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ ఆయన రాసిన ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సెట్లోని సిబ్బంది పట్ల రణ్వీర్ చూపిన గౌరవానికి నెటిజన్లు ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.