TG: బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో కూడా ఐటీ టవర్లు నిర్మించిందని, కాంగ్రెస్ సర్కారు ఆ టవర్లను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో గతంలో 18 కంపెనీలు పనిచేస్తుంటే.. ఇప్పుడు 11 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. కనీసం ఇంటర్నెట్ బిల్లు కూడా కట్టడం లేదని తెలిపారు. ఐటీ టవర్లో పనిచేసే ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు.