ATP: యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన ఐదేళ్ల హేమచంద్ర నేడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం కిడ్నాప్‌నకు గురైన బాలుడిని దుండగులు హత్య చేసి కందనకోట కొండల్లో పడేశారు. బాలుడిని సొంత బావనే హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.