MLG: మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 11 మంది పంచాయతీ కార్యదర్శులను జిల్లాలోని వివిధ మండలాలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ దివాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం మరియు మెరుగైన సేవల కోసం ఈ బదిలీలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. బదిలీ అయిన కార్యదర్శులు తక్షణమే కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని సూచించారు.