మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం స్థలానికి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ చేరుకున్నారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.