విశాఖపట్నం మహారాణిపేట అంబికాబాగ్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మార్చి 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరగనుందని దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రకాశం: గిద్దలూరు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మౌలాబి అనే మహిళాకు గత కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పందించారు. వెంటనే బాధితురాలి కుమారుడు దస్తగిరిని పరామర్శించి వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు.
సత్యసాయి: జిల్లాలో ఐదేళ్లకు పైగా ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లకు రెండో రోజు బదిలీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పారదర్శకంగా కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ ప్రక్రియలో 20 మంది ఏఎస్సైలు, 51 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 27 మంది మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
TPT: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలను స్వయంగా విని అర్జీలు స్వీకరించారు. మొత్తం 294 అర్జీలు అందగా, సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని సూచించారు.
CTR: యాదమరి మండలం వరిగపల్లె జంక్షన్ వద్ద సోమవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా అక్రమ పొగాకు పట్టుబడింది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న టాటా ఇంట్రా వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అయితే సుమారు రూ.8.99 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులు లభ్యమైంది. డ్రైవర్ నదీమ్ పాషాను ప్రశ్నించగా సరుకు రవాణాకు సంబంధించిన బిల్లులు లేవని పోలీసులు తెలిపారు.
TPT: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వడగాల్పులు, వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించే బ్యానర్‌ను జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు ప్రారంభించారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. బాలకృష్ణ నాయక్ సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
PPM: వీరఘట్టం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ పి.రవి కుటుంబానికి తోటి సిబ్బంది అండగా నిలిచారు. సిబ్బంది ప్రోగు చేసిన రూ.1,64,000 ఆర్థిక సాయాన్ని ఎస్పీ మాధవరెడ్డి సోమవారం రవి సతీమణి లలితకు అందజేశారు. కష్టకాలంలో శాఖ ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.
CTR: చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి IDRF నిధి నుంచి రూ.1 లక్ష విలువైన చెక్కును దివంగత ASI మనోహరన్ కుటుంబానికి అందజేశారు. చిత్తూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మనోహరన్ అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ చెక్కును ఆయన సతీమణి భారతి స్వీకరించారు. ఈ సందర్భంగా, ఎస్పీ మాట్లాడుతూ.. కుటుంబానికి తమ పూర్తి అండ ఉంటుందని భరోసా ఇచ్చారు.
కర్నూలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 85 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, పెట్టుబడి మోసాలు, ఆస్తి వివాదాలు ప్రధానంగా వచ్చాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ చేసి త్వరితగతిన న్యాయం చేస్తామని సోమవారం తెలిపారు. అధికారులకు వెంటనే స్పందించాలని ఎస్పీ ఆదేశించారు.
నంద్యాలలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇవాళ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నంద్యాల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రకాశం: పొదిలి పట్టణం దర్శి రోడ్డులోని కుంచెపల్లి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ELR: బీజేపీ ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమాని సోమవారం ఏలూరులో నిర్వహించారు. ఈ మేరకు ఏలూరు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ చౌటపల్లి విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వికు బీజేపీ శ్రేణులు వినతిపత్రాలు అందజేశారు. అలాగే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ASR: అపరాల పంటల సాగులో నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జీకేవీధి మండల ఏవో గిరిబాబు అన్నారు. ఆత్మ పథకం సౌజన్యంతో సోమవారం అపరాల పంటల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతులు అధిక దిగుబడులు ఇచ్చే మేలైన రకాలను ఎంచుకోవాలని సూచించారు.
విజయనగరం పట్టణంలోని ఓ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రెడ్డి సీతారాం అనే యువకుడికి సుమారు రెండు తులాల బంగారు బ్రాస్లెట్ నిన్న సాయంత్రం దొరికింది. సదరు యువకుడు క్షణం కూడా ఆలోచించకుండా 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో బ్రాస్లెట్‌ను అప్పగించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు యువకుడి నిజాయితీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని మహాకవి తిక్కన ఎస్‌పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా.. పాఠశాలలో నమోదైన 136 మంది విద్యార్థులకు సరుకులు తీసుకున్నప్పటికీ, కేవలం 30 మందికే సరిపడా భోజనం తయారు చేసినట్లుగా గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.