AKP: గృహ గణనపై కోటవురట్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఇవాళ ముగిసాయి. మూడవరోజు అవగాహన కోసం కోటవురట్లలో అధికారులు సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి గృహ గణన నిర్వహించినట్లు తహసీల్దార్ తిరుమలరావు, మాస్టర్ ట్రైనర్ ప్రతాప్ కుమార్ తెలిపారు. గృహ యజమానులను అడిగి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు.