VSP: ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవానికి సంబంధించి టికెట్లు ఆన్లైన్లో భక్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. అయితే టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసే సమయంలో టెక్నికల్ సమస్య ఏర్పడినట్లు భక్తులు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంపై టెక్నికల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపామని, భక్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.