ATP: ఆత్మకూరు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ జగదీష్ శనివారం సాయంకాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమగ్రంగా ఆరా తీశారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పారదర్శకత పాటించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.