GNTR: తాడేపల్లిలో ఓ వివాహిత భర్త ఇంటి ముందు నిరసన చేపట్టిన ఘటన సోమవారం జరిగింది. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన మహిళకు 2017లో మందడం గ్రామానికి చెందిన విజయ్‌తో వివాహం జరిగింది. పెళ్లైన ఎనిమిది నెలలకే భర్త వదిలేశాడని ఆమె ఆరోపించింది. ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపి, కుంచనపల్లిలోని భర్త నివాసం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.