GDWL: కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల మౌలిక హక్కులను కాలరాస్తున్నాయని ఐఎఫ్టీయూ గద్వాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. దీనివలన కాంట్రాక్ట్ విధానం పెరిగి కార్మికులకు భద్రత కరువవుతుందన్నారు.