E.G: ఆసియా బ్యాడ్మింటన్ పోటీలకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కండ్రపు దుర్గా ఈశా ఎంపికైంది. మే 21 నుంచి 24 వరకు గౌహతిలో జరిగిన సెలక్షన్లో దుర్గా ఈశా అద్భుతమైన ప్రతిభ కనబరిచి జూనియర్ ఏషియన్ పోటీలకు ఎంపికైంది. జూన్ 26న జరగనున్న ఏషియా పోటీల్లో ఇండియా తరఫున పాల్గొననుంది.