KRNL: ఈ నెల 26, 27, 28వ తేదీల్లో తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎన్.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు కార్మికులకు పిలుపునిచ్చారు. పత్తికొండలోని చదువుల రామయ్య భవన్లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.