AKP: పిల్లలను జింక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలని ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. సోమవారం అనకాపల్లి పట్టణం అంజయ్య కాలనీలో పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటిలో తయారు చేసుకున్న పదార్థాలే పిల్లలకు ఇవ్వాలన్నారు. గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలన్నారు.