అన్నమయ్య జిల్లా వీరబల్లిలో వీరనాగమ్మ తల్లి తిరుణాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3, 4 తేదీల్లో మంగళవాయిద్యాలు, బోనాల సమర్పణతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు అమ్మవారి కళ్యాణం జరగనుంది. ఈ తిరునాళ్లకు భక్తులు భారీగా తరలిరావాలని నిర్వాహకులు కోరారు.