PPM: సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పేదల సేవలో భాగంగా ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్లను బుధవారం పంపిణీ చేశారు. గుచ్చిమి గ్రామంలో స్వయంగా ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.