NTR: రామవరప్పాడులో అక్రమ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఐపీఎల్ సీజన్ కావడంతో ఇరువురు వ్యాపారస్తులు బెట్టింగ్ రాకెట్లను నిర్వహిస్తూ భారీగా నగదు లావాదేవీలు జరుపుతున్నట్లు సమాచారం. వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, తెర వెనుక బెట్టింగ్ వ్యవహారాలను నడిపిస్తూ.. యువతను ఆకర్షిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.