PPM: దళాయిపేట గ్రామ పరిసర ప్రాంతాల్లోని అరటితోటల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపించినప్పుడు వాటిని రెచ్చగొట్టకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.