కాకినాడ బీచ్ రోడ్లోని కుంభాభిషేకం రేవు వద్ద నూతనంగా నిర్మించబోయే వంతెన నిర్మాణ పనులపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సంబంధిత అధికారులతో ఇవాళ సమగ్ర సమీక్ష నిర్వహించారు. వంతెన నిర్మాణం నాణ్యతగా, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మత్స్యకారులకు వారి వృత్తిలో ఎటువంటి అవరోధాలు కలుగకుండా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.