PPM: పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని DIO డాక్టర్ విజయమోహన్ అన్నారు. ఈ మేరకు సూరంపేటలో టీకా కార్యక్రమాన్ని ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యాక్సిన్ వయల్స్ పరిశీలించి ఉపయోగించిన తేదీలను నమోదు చేయాలన్నారు. ఎంతమందికి టీకాలు వేశారు, వారి గడువు తేదీలను పరిశీలించారు. పిల్లలకు నిర్దేశించిన టీకాలను గడువు దాటకముందే పూర్తిచేయాలని ఆదేశించారు.