NDL: అమరావతి సచివాలయంలో ఇవాళ సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. బనగానపల్లె ఎమ్మెల్యే, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో సీఎం ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రంలో ఉన్న రోడ్ల నిర్మాణాల గురించి మంత్రులతో పలు కీలక విషయాలను చర్చించారు.