NRML: రామ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని జిల్లా టీకాల అధికారి డాక్టర్ నయన రెడ్డి గురువారం ప్రారంభించారు. 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకా అందజేస్తూ, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. బాలికలు తప్పకుండా ఈ టీకాను వేయించుకోవాలని సూచించారు.