MNCL: దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవని బెల్లంపల్లి MLA వినోద్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలపై GMకి వినతిపత్రం అందజేశారు. స్టేషన్ అభివృద్ధి,ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, రైల్వే సేవలను విస్తరించడం వంటి అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని GM తెలిపారని MLA పేర్కొన్నారు.