MDCL: బోడుప్పల్ సర్కిల్లోని అంబేద్కర్ నగర్, మున్సిపల్ కార్యాలయం, కమల హాస్పిటల్ ప్రాంగణాల్లో గురువారం వైద్య శిబిరాలు నిర్వహించారు. డాక్టర్ చైతన్య కుమార్ పర్యవేక్షణలో వైద్యులు ప్రజలకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమల నివారణకు తగిన చర్యలు చేపడతామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.