NDL: జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ సునీల్ షౌరాణ్ బుధవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానాస్పద వాహనాలు, నిషేధిత వస్తువుల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం గురించి వివరించారు.