NDL: బనగానపల్లె(మం) దద్దనాల చెరువు దగ్గర ఇవాళ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో బోయ శేషమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆటో అతివేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.